గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (18:31 IST)

మమతా బెనర్జీ నామినేషన్‌ను తిరస్కరించాలి : సువేందు అధికారి

వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నామినేషన్‌ను తిరస్కరించాలని బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న టీఎంసీ మాజీ నేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. 
 
ఈ నెల పదో తేదీన నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ నామినేషన్ దాఖలు చేశారు. ఆ రోజునే ఆమెపై దాడికూడా జరిగింది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 
 
మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్‌పై ప్రత్యర్థి సువేందు అభ్యంతరం వ్యక్తం చేశారు. మమతపై ఆరు క్రిమినల్‌ కేసులు ఉన్నప్పటికీ ఆమె వాటిని అఫిడవిట్‌లో పేర్కొనలేదని ఈసీకి ఫిర్యాదు చేశారు. బెంగాల్‌లో ఒక సీబీఐ కేసుతో పాటు అసోంలో ఆమెపై ఐదు క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీదీ నామినేషన్‌ను తిరస్కరించాలని ఈసీని కోరినట్టు చెప్పారు. అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు చెప్పారు. వారేం ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూస్తామని, చట్టపరంగా చర్యలు ఉండాలన్నారు. నిబంధనలు ఎవరికైనా ఒకటేనని, తన బాధ్యతగా ఈసీకి అన్ని ఆధారాలూ సమర్పించానన్నారు.