తమిళనాడు సర్కారుతో పాటు ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం నోటీసులు
డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ చేసిన పిటిషన్‌లో మొత్తం 14 పార్టీలను చేర్చారు. వీటిలో తమిళనాడు ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, డీజీపీ, పోలీస్ కమిషనర్, సీబీఐ, ఇతరులు ఉన్నారు.
ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు.. తమిళనాడు ప్రభుత్వం, ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, నటుడు, డీఎంకే నేత అయిన ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికీ ఉదయనిధిపై పలు రాష్ట్రాల్లో పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి.
కాగా సెప్టెంబర్ 2 సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి, దానిని వ్యతిరేకించడమే కాదు, "నిర్మూలన" చేయమని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. సనాతన నిర్మూలన సదస్సులో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని అన్నారు.