గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 మే 2022 (22:44 IST)

తాజ్‌మహల్‌లో మూసివున్న 22 గదుల్లో ఏమున్నాయి? (video)

taj mahal
ఆగ్రాలోని ప్రేమమందిరం తాజ్‌మహాల్‌లో ఉన్న గదుల్లో 22 గదులు ఎంతోకాలంగా మూసివున్నాయి. ఇపుడు ఈ గదుల్లో ఏముందన్న సందేహం ఉత్పన్నమైంది. దీంతో ఈ సీలువేసిన 22 గదుల్లో ఏమున్నాయన్న అంశంపై ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) విచారణ జరిపించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. 
 
ఈ పిటిషన్‌లో హిందూ దేవతల విగ్రహాలను తలుపుల వెనుక ఉంచారు. తాజ్ మహల్‌లోని 22 సీలు చేసిన గదులపై ఏఎస్‌ఐ విచారణ జరిపించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. తాజ్ మహల్ చరిత్రపై ఉన్న వివిధ రకాలైన సందేహాలను వీలైనంత మేరకు నివృత్తి చేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కాగా, ఈ స్మారక చిహ్నం పురాతన శివాలయం అని చరిత్రకారులు, హిందూ సంఘాల ప్రకటనలను కూడా పిటిషన్ ప్రస్తావించింది.