శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (11:31 IST)

భార్యకు శీలపరీక్ష : మర్మాంగాన్ని తీగతో కుట్టేసిన భర్త!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కట్టుకున్న భార్యకు.. ఓ భర్త శీలపరీక్ష నిర్వహించాడు. ఈ శీల పరీక్ష పేరుతో ఓ భర్త తన భార్య మర్మంగాన్ని అల్యూమినియం తీగతో కుట్టేశాడు. ఈ దారుణ ఘటన రాంపూర్ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాంపూర్ జిల్లాలోని మిలాక్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి శీల పరీక్ష చేస్తానంటూ ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో.. ఆమెకు తీవ్ర రక్తశ్రామవైంది. బాధ తాళలేక ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు బాధితురాలని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తల్లి నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తనపై అనుమానం పెంచుకుని నిత్యం ప్రశ్నలతో వేధిస్తుండేవాడని భార్య పోలీసులకు తెలిపింది. ‘ఏకారణం లేకుండానే అతడు నన్ను కొట్టేవాడు. మరోవ్యక్తితో నాకు సంబంధం ఉందని అనుమానించేవాడు. అంతేకాకుండా.. నా పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలని నన్ను కోరాడు. అయితే.. ఇంతదారుణానికి పూనుకుంటాడని అస్సలు ఊహించలేదు అని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. కాగా.. బాధితురాలికి రెండేళ్ల క్రితం పెళ్లైందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.