గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (10:35 IST)

వధువుతో వింత అగ్రిమెంట్... ఏంటా ఒప్పందం!

cricket agreement
తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో వారాంతాల్లో క్రికెట్‌ ఆడేందుకు తన భర్తను అనుమతిస్తానని ఓ నవవధువు బాండ్‌ పేపరుపై రాసి ఇవ్వాల్సి నిర్బంధ పరిస్థితి వచ్చింది. వరుడు హరిప్రసాద్‌ తేనీలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. పైగా, మంచి క్రికెటర్ కూడా. ఈయన 'సూపర్‌స్టార్‌' క్రికెట్‌క్లబ్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. 
 
ఇదిలావుంటే హరి ప్రసాద్‌కు మదురైకు చెందిన పూజ అనే యువతితో వివాహం ఏర్పాటుచేశారు. పెళ్లికి వచ్చిన వరుడి స్నేహితులు పెళ్లికుమార్తెకు ఓ షరతు విధించారు. శని, ఆదివారాల్లో హరిప్రసాద్‌ను క్రికెట్‌ ఆడేందుకు అనుమతించాలని పెళ్లి కుమార్తెను కోరారు. 
 
ఆ మేరకు రూ.20 బాండు పేపరు మీద సంతకం కూడా చేయించారు. మొదట్లో ఆట పట్టిస్తున్నారేమో అనుకొన్న పూజ.. క్రికెట్‌ విషయంలో స్నేహితులకు ఉన్న పట్టుదలను చూసి వేదికపైనే సంతకం చేయక తప్పలేదు. దీంతో పెళ్లికి వచ్చిన అతిథిలు, బంధువులు ఆశ్చర్యపోయారు.