శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కె
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (11:35 IST)

మీడియాను రక్షిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్

ప్రజా గొంతుకను రక్షించే దిశగా స్టాలిన్... గొంతు నొక్కే దిశ‌గా పలువురు సీఎంలు. ఇపుడిదే టాపిక్. జర్నలిస్టులపై, న్యూస్ ఛానెళ్లపై గత ప్రభుత్వం ఎఐడిఎంకె ప్ర‌భుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని స్టాలిన్ ఎత్తివేశారు.

ఇలా తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా నిలబడడం చాలా గొప్ప విషయమ‌ని పేర్కొంటున్నారు. అధికారంలోకి రావడం కోసం పార్టీకో పత్రిక, ఛానెల్ పెట్టుకొవడం, కొన్ని పత్రికలు కొన్ని పార్టీలకు కరపత్రాలుగా మారిపోవడం మన దేశ దౌర్భాగ్యం.

ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిజం బతికి బట్ట కట్టడం 'ఎడారిలో ఎండమావే. కానీ, ప‌క్క రాష్ట్రం అయిన త‌మిళ‌నాడులో సీఎం స్టాలిన్ విప్ల‌వాత్మ‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని, ప‌త్రిక స్వేచ్ఛ‌కు ప్రాణం పోస్తున్నార‌ని పేర్కొంటున్నారు.