బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కోయంబత్తూరులో కారు బాంబు పేలుడు - చెన్నై ఎయిర్‌‍పోర్టులో హైఅలెర్ట్

car blast in covai
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో కారులో సంభవించిన పేలుడులో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ మృతుడు ఎవరనేది పోలీసులు గుర్తించారు. ఈ పేలుడుతో అప్రమత్తమైన భద్రతా బలగాలు చెన్నైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. చెన్నైలో ఐదు అంచెల భద్రను కల్పించారు. 
 
కోయంబత్తూర్‌లోని ఉక్కడంలోని హిందూ ప్రార్థనా స్థలం కోట్ ఈశ్వరన్ ఆలయం ముందు ఈ ఉదయం మారుతీ కారు పేలిపోయింది. కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. కారులోని గ్యాస్ సిలిండర్ పేలి కారు రెండు ముక్కలైందని ప్రాథమిక విచారణలో తేలింది. 
 
ఈ నేపథ్యంలో కారు పేలుడులో మరణించింది ఎవరు? కారు రిజిస్ట్రేషన్ నంబర్ పొల్లాచ్చి చిరునామాలో ఉండడంతో పోలీసులు ఆ చిరునామాపై సీరియస్‌గా విచారణ చేపట్టారు. అలాగే, కారు పేలుడులో మరణించింది ఎవరు? అనేది ఇప్పుడు వెల్లడైంది. 
 
ఈ పేలుడులో చనిపోయిన వ్యక్తిని కోయంబత్తూరులోని ఉక్కడం ప్రాంతానికి చెందిన జేమీసా ముబిన్‌గా గుర్తించారు. జేమీసా ముబిన్‌కు ఉక్కడం ప్రాంతంలో పాత బట్టలు విక్రయించే వ్యాపారం ఉంది. 2019లో మరణించిన జేమీసా ముబిన్ ఇంటిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దాడులు చేసినట్లు సమాచారం. 
 
జేమీసా ముబిన్‌పై ఎన్‌ఐఏ విచారణ చేపట్టింది. దీంతో మృతుడు జేమీసా ముబిన్‌ కుటుంబ సభ్యులతో పాటు అతడితో సంబంధం ఉన్న వ్యక్తులను విచారిస్తున్నారు. ఉక్కడంలోని కారు సిలిండర్ పేలుడు ఘటనలో మృతి చెందిన వ్యక్తి ఎవరనేది వెల్లడికాగా.. కొన్నాళ్ల క్రితం అతడిని ఎన్ఐఏ విచారించినట్లు సమాచారం. దీంతో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.. కారు పేలుళ్లా? లేక మరేదైనా దాడికి ప్లాన్ చేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.