అమ్మో.. స్కూల్స్ ఓపెన్ వద్దు.. తమిళనాడు నిర్ణయం

schools
schools
సెల్వి| Last Updated: గురువారం, 12 నవంబరు 2020 (16:37 IST)
ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ ఓపెన్ కావటం విద్యార్ధులకు, టీచర్లకు కరోనా సోకి భయపెడుతోంది. ఏపీలో పరిస్థితి చూసిన తమిళనాడు ప్రభుత్వం స్కూల్స్ తెరిచే విషయంలో వెనక్కి తగ్గింది. నవంబర్ 16 నుంచి తొమ్మిది నుంచి ఆపై క్లాసుల్ని తెరవాలని యోచించింది. కానీ కరోనా భయంతో పునరాలోచనలో పడింది.

స్కూల్స్ ప్రారంభించాలని కొందరు తల్లిదండ్రులు చెప్పినప్పటికీ… ఎక్కువ మంది కరోనా భయాలతో స్కూళ్లను తెరవద్దని కోరారని అందుకే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకంటున్నామని తెలిపింది. రీసెర్చ్ స్కాలర్లు, ఫైనలియర్ పీజీ విద్యార్థులకు డిసెంబర్ 2 నుంచి కాలేజీలు, యూనివర్శిటీలను ప్రారంభిస్తామని చెప్పింది.

ఇప్పటి వరకు తమిళనాడులో 7.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 11,415 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ఐదో స్థానంలో ఉంది.దీనిపై మరింత చదవండి :