మనవరాలి వరసయ్యే బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చడంతో..
60 ఏళ్ల వృద్ధుడు మనవరాలి వరసయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. వివరాల్లోకి వెళితే.. పదహారేళ్ల బాలిక తల్లి చనిపోవడంతో తండ్రి, ముగ్గురు సోదరులతో కలిసి ఉంటోంది. ముగ్గురు సోదరులు పాఠశాలల్లో చదువుతున్నారు బాలిక పెద్ద కూతురు కావడంతో ఇంటి బాధ్యత నిర్వహిస్తుండేది.
తండ్రి కూలి పనికి వెళ్లి సాయంత్రం వచ్చేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్రామానికి చెందిన వ్యక్తి (60) ఆమెకు మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించి పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు.
రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురవడంతో తండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షలు నిర్వహించగా గర్భవతి అని నిర్ధారణ అయింది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడగా వృద్ధుడిని విచారిస్తున్నారు.