ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (08:52 IST)

వ్యభిచార గృహాన్ని నడుపుతున్న మహిళా సెక్యూరిటీ గార్డు

prostitution
మహారాష్ట్రలోని థానేలో ఓ మహిళా సెక్యూరిటీ గార్డు తన ఇంటిలో వ్యభిచారం గృహాన్ని నిర్వహిస్తూ పోలీసులకు చిక్కింది. పలువురు అమ్మాయిలతో ఈ సెక్స్ రాకెట్ జరుపుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందం పోలీసులు ఆ ఇంటిపై దాడి శారు. దీనిపై మానవ అక్రమ రవాణా విభాగం ఇన్‌స్పెక్టర్ మహేష్ పాటిల్ స్పందించారు. 
 
ఈ వ్యభిచార గృహాన్ని నడుపుతూ వచ్చిన మహిళను ముంబై రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేసినట్టు తెలిపారు. విటుడు కోరుకునే అమ్మాయిలను వారి ప్రాంతాలకు వాట్సాప్ లొకేషన్ ద్వారా చేరవేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అరెస్టు ఉమెన్ సెక్యూరిటీ గార్డుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.