గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జులై 2022 (09:56 IST)

తెలంగాణాలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుంది : ప్రధాని మోడీ

narendramodi
తెలంగాణ రాష్ట్రాంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటై తీరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు వేడుకల్లో భాగంగా, ఆదివారం సాయంత్రం వియజ్ సంకల్ప్ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఇందులో ఆయన పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 
 
ఆవిష్కరణల్లో దేశంలోనే తెలంగాణ కేంద్రంగా మారిందన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వస్తే తెలంగాణలో సత్వర అభివృద్ధి జరుగుతుందన్నారు. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌తోనే ప్రతి పట్టణం, పల్లె అభివృద్ధి చెందుతాయని వివరించారు. 
 
తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం వచ్చానన్న మోడీ.. రాష్ట్ర అభివృద్ధే భాజపా ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. భాజపాపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పెరుగుతోందని.. డబుల్ ఇంజిన్ సర్కారు కోసం రాష్ట్ర ప్రజలు పట్టాలు వేస్తున్నారని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి అందిస్తోన్న సహకారాన్ని వివరించిన మోజీ.. పలు వరాలు సైతం కురిపించారు.
 
ప్రాచీన సంస్కృతి, పరాక్రమానికి తెలంగాణ పురిటిగడ్డ అని కొనియాడారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, శిల్పకళ.. అందరికీ గర్వకారణమన్నారు. తెలంగాణ పవిత్ర భూమి అని.. దేశప్రజలకు యాదాద్రి, జోగులాంబ, భద్రకాళి ఆశీస్సులు ఉంటాయన్నారు. హైదరాబాద్‌ నగరం అన్నిరంగాల వారికి అండగా నిలుస్తోందన్నారు. 
 
తెలంగాణ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఆదరించారని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు భాజపాపై నమ్మకం ఎన్నోరెట్లు పెరిగిందని స్పష్టం చేశారు. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. మంత్రంతో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
narendramodi
 
తెలంగాణ అభివృద్ధే మా పార్టీ ప్రాధాన్యత అని అన్నారు. 'ఆవిష్కరణల్లో దేశంలోనే తెలంగాణ కేంద్రంగా మారింది. తెలంగాణ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. హైదరాబాద్‌ చుట్టూ ప్రాంతీయ రింగ్‌రోడ్డు కూడా నిర్మిస్తున్నాం. భాగ్యనగరంలో అనేక పైవంతెనలు నిర్మించాం. మా పాలనలో తెలంగాణలో హైవేలు రెండురెట్లు పెరిగాయి. తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మిస్తాం. తెలంగాణలో డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చి తీరుతుంది. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వస్తేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం వచ్చా. కొత్త జాతీయ విద్యావిధానంలో మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చాం. తెలుగులో సాంకేతిక, వైద్యవిద్య అందుబాటులోకి వస్తే పేదల కలలు సాకారం. తెలంగాణలో రూ.35 వేల కోట్లతో 5 భారీ ప్రాజెక్టులు చేపట్టాం. తెలంగాణలో ప్రతి పల్లెకూ రోడ్లు అనుసంధానం చేస్తున్నాం. తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మిస్తాం. తెలంగాణ అభివృద్ధే మా పార్టీ ప్రాధాన్యత. భాజపాపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పెరుగుతోంది' అని ఆయన అన్నారు. 
 
కరోనా కష్టకాలంలో ప్రతి కుటుంబానికి అండగా నిలిచామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నచోట వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. 8 ఏళ్లుగా దేశప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెంచామన్నారు. తమ పాలనలో గ్రామాల్లోని యువతకు ప్రోత్సాహం ఇస్తున్నట్టు వివరించారు. పంటలకు కనీస మద్దతు ధర పెంచామన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందన్నారు.
 
మహిళా శక్తిని దేశ శక్తిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బ్యాంకు డిపాజిట్లలో మహిళల వాటా పెరిగింది. మహిళా శక్తిని దేశ శక్తిగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నాం. బ్యాంకు డిపాజిట్లలో మహిళల వాటా పెరిగింది. కొత్త జాతీయ విద్యావిధానంలో మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చాం. తెలుగులో సాంకేతిక, వైద్యవిద్య అందుబాటులోకి వస్తే పేదల కలలు సాకారమవుతాయి అని అన్నారు.