అసోం మాజీ సిఎం పరిస్థితి మరింత విషమం!

tarun gogoi
ఎం| Last Updated: ఆదివారం, 22 నవంబరు 2020 (19:26 IST)
అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగొయ్‌ ఆరోగ్యం మరింత విషమించింది. ఇటీవల కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో నవంబరు 2 నుంచి గౌహతి మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

అప్పటి నుంచి ఆయనకు చికిత్స కొనసాగుతోంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్టు అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత బిశ్వ శర్మ వెల్లడించారు.

ఆయన ఆరోగ్యం క్షీణించిందని, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, దీంతో ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌ను అమర్చారని తెలిపారు.

ఆయన పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నారని, శరీరంలో చాలా అవయవాలు పనిచేయడం లేదని పేర్కొన్నారు. ఔషధాలు, ఇతర చికిత్స ద్వారా అవయవాలు పునరుద్దరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
దీనిపై మరింత చదవండి :