గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (18:41 IST)

యూపీలో బీజేపీకి మ‌రో షాక్‌: పార్టీకి మంత్రి ధరమ్ సింగ్ బైబై

Dharam Singh Saini
ఎమ్మెల్యే ముఖేష్ వర్మ బీజేపీ వీడిన కొద్ది గంటల్లోనే వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన స్వ‌తంత్ర మంత్రి ధరమ్ సింగ్ కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. దీంతో యూపీలో బీజేపీకి మ‌రో షాక్‌ తప్పలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్ద‌రు మంత్రులు బీజేపీని వీడారు. 
 
కేబినెట్ మంత్రి స్వామి ప్ర‌సాద్ మౌర్య త‌న ప‌లుకుబ‌డితో తన‌కు అనుకూలంగా ఉన్న నేత‌ల‌ను బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. నేత‌లు పార్టీని వీడుతున్న‌ప్ప‌ట‌కి బీజేపీ మాత్రం నోరు మెద‌ప‌డం లేదు. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దే అని ధీమాను వ్య‌క్తం చేస్తుంది బీజేపీ. వ‌చ్చే నెల‌లో యూపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ అన్నిపార్టీలు ప్ర‌చారానికి సిద్ధం అవుతున్నాయి.