ఒకటిన్నర టన్నుల బరువు - రోజుకు 15 లీటర్ల పాలు తాగుతున్న అరుదైన దున్న
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరుగుతున్న ఓ వ్యవసాయ ప్రదర్శనకు ఓ అరుదైన దున్న రైతులను విపరీతంగా ఆకర్షించింది. కర్నాటక రాష్ట్రంలోని బెళగావికి చెందిన రెడ్యాచే మాలక్ అనే రైతుకు చెందిన ఈ దున్న పేరు గజేంద్ర. పంజాబ్ రైతులు ఈ దున్నను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ, ఆ యజమాని మాత్రం ససేమిరా అన్నారు.
దీనికి కారణం.. 1500 కేజీల బరువుండే ఈ దున్న రోజుకు 15 లీటర్ల పాలు తాగడంతో పాటు రెండు కేజీల పిండి, మూడు కిలోల గడ్డిని మేతగా ఆరగిస్తుంది. ఈ తరహా దున్నలు తమ దగ్గర ఐదు ఉన్నాయని బెళగావి రైతు తెలిపారు. కుటుంబ సభ్యుల్లా చూస్కుంటున్న వీటిని ఎన్ని కోట్లు ఇచ్చినా అమ్మేది లేదని తెగేసి యజమాని రెడ్యాచే వెల్లడించారు.