గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (09:50 IST)

భారత ముస్లింలకు ఈ ఏడాది హజ్ యాత్ర లేనట్లే

కరోనా ప్రభావం హజ్ యాత్రపై పడింది. వెయ్యి మందిలోపు భక్తులను మాత్రమే ఈ ఏడాది హజ్‌ యాత్రకు అనుమతిస్తామని సౌదీ అరేబియా స్పష్టం చేసింది.

ఇంత తక్కువ మందికి అవకాశం కల్పించడమనేది 90ఏళ్ల సౌదీ చరిత్రలో ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలిపాయి. సౌదీ ప్రకటన నేపథ్యంలో హజ్‌ యాత్రకు భారత్‌ నుంచి ఎవరినీ పంపించబోమని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ పేర్కొన్నారు. ఇప్పటికే డిపాజిట్‌ చేసిన వారికి ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు వాపస్‌ చేస్తామని తెలిపారు.