సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2017 (09:36 IST)

ఆర్మీ జవాను అత్యాచారం.. స్కూలుకు వెళ్తే బాధితురాలిని ఏం చేశారంటే?

మహారాష్ట్రలోని పాఠాశాలలో చదివే ఓ విద్యార్థిని ఆర్మీ జవాను చేతిలో మోసపోయింది. 11వ తరగతి చదువుతున్న బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమెను లోబరుచుకున్నాడు. ఆపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు

మహారాష్ట్రలోని పాఠాశాలలో చదివే ఓ విద్యార్థిని ఆర్మీ జవాను చేతిలో మోసపోయింది. 11వ తరగతి చదువుతున్న బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమెను లోబరుచుకున్నాడు. ఆపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ముఖం చాటేశాడు. ప్రియుడి మోసాన్ని లేటుగా తెలుసుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
వైద్య పరీక్షల్లోనూ ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్మీ జవానుపై కేసు నమోదు చేశారు. అత్యాచారానికి గురై ప్రియుడి చేతిలో మోసపోయిన విద్యార్థిని పాఠశాలకు వెళ్తే అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. 
 
బాలిక అత్యాచారానికి గురికావడంతో పాటు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడంతో తమ పాఠశాల ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని భావించిన స్కూలు యాజమాన్యం ఆమెను స్కూలు నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. అత్యాచార బాధితురాలిపై స్కూలు యాజమాన్యం వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.