బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2020 (08:05 IST)

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు తృణమూల్‌ మద్దతు

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాజపాకు మద్దతు ఇస్తున్నట్లు అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) ప్రకటించింది. తాజాగా.. అధికార ఆమ్‌ ఆద్మీకి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు టీఎంసీ అధికార ప్రతినిధి దేరెక ఓబ్రెయిన్‌ ట్వీట్‌ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌కు ఓటేసి గెలిపించాల్సిం దిగా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓటేయండి. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ అభ్యర్థికి ఓటేయండి. కేజీవ్రాల్‌తో పాటు ఆప్‌ అభ్యర్థులందరికీ ఓటేసి గెలిపించండి’ అంటూ ఓబ్రెయిన్‌ ట్వీట్‌తో పాటు వీడియో కూడా పోస్ట్‌ చేశారు.

ఆప్‌ గతంలో ఇచ్చిన హావిూలన్నింటినీ నెరవేర్చిందని ఓబ్రెయిన్‌ అన్నారు. విద్యావ్యవస్థ, ఎలక్టిస్రిటీ, వైద్యరంగంలో మార్పులు తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ చాలా బాగా పనిచేసిందని ఆయన వీడియో ద్వారా చెపðకొచ్చారు.

హస్తినలో ఆప్‌, భాజపా, కాంగ్రెస్‌ పార్టీల మధ్య త్రిముఖ పోరు ఏర్పడింది. ఇప్పటికే భాజపా, ఆప్‌ నేతలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు.

మరోసారి అధికారంలోకి రావాలని ఆప్‌ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భాజపా ఉవ్విళ్లూరుతోంది. ఫిబ్రవరి 8న హస్తినలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు వెలువడనున్నాయి.