శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జులై 2020 (11:41 IST)

త్రిపురలో గ్యాంగ్ రేప్‌‌ల కలకలం.. ఆందోళన బాట పట్టిన విద్యార్థులు

త్రిపురలో గ్యాంగ్ రేప్‌ కలకలం రేపుతున్నాయి. అత్యాచారాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. 17 ఏళ్ల టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరగగా, మరో ఘటనలో 30 ఏళ్ల గృహిణిపై అత్యాచారం, ఏడేళ్లపాపపై జరిగిన లైంగిక వేధిపులు ఆందోళనకు దారితీశాయి. 
 
మరో ఘటనలో కరైలాంగ్పారా గరామంలో... ఓ గృహినిని... ఆ ఏరియాలో నివసించే... 21 ఏళ్ల కుర్రాడు లైంగికంగా వేధించి, రేప్ చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా... మరో విషయం తెలిసింది. బాధితురాలి కూతురైన ఏడేళ్ల పాపపైనా నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
 
ఈ రెండు ఘటనలపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. నేరస్థులకు కఠిన శిక్షలు వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. త్రిపుర యూనివర్శిటీలో పీజీ చదువుతున్న ఓ యువతి ఈ అంశంపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. ఇలా ఇటీవల మొత్తం ఐదు కేసుల్లో రేపిస్టులకు శిక్షలు అమలు విధించట్లేదని ఆమె తన పోస్టులో మండిపడింది.