ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (17:47 IST)

మందుబాబు రోడ్డుకు అడ్డంగా కుర్చీలో కూర్చున్నాడు.. ఏమైందంటే? (video)

Lorry
Lorry
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో భారీ వర్షం కురుస్తున్నా పట్టించుకోకుండా ఓ మందు బాబు రోడ్డు మధ్యలో కుర్చీపై కూర్చున్నాడు. అతడు కూర్చున్న కుర్చీని ట్రక్కు ఢీకొట్టడంతో తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన గురువారం జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఆ వీడియోలో, ఆ వ్యక్తి పోలీసు చెక్‌పోస్టు ముందు రోడ్డుపై కూర్చుని వాహనాలు వెళుతుండగా కనిపించాడు. నడిరోడ్డుపై ఎలా కూర్చున్నాడు చూడండి అంటూ తిట్టుకుంటున్నప్పుడే రోడ్డుపై వచ్చిన లారీ అతని కుర్చీని ఢీకొట్టింది. దీంతో ఆ మందు బాబు కుర్చీ నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో ఆయనకు గాయాలేమీ కాలేదు.