శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (09:54 IST)

పళనిస్వామిని తొలగించిన టీటీవీ దినకరన్ : డీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు యత్నాలు

ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామికి అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తేరుకోలేని షాకిచ్చారు. జిల్లా కార్యదర్శిగా ఉన్న ఎడప్పాడిని ఆ పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదేసమయంలో ఆయ

ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామికి అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తేరుకోలేని షాకిచ్చారు. జిల్లా కార్యదర్శిగా ఉన్న ఎడప్పాడిని ఆ పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదేసమయంలో ఆయన విపక్షమైన డీఎంకేతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దినకరన్ పావులు కదుపుతున్నారు. 
 
మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంను తన గూటిలోకి చేర్చుకుని, ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేని టీటీవీ దినకరన్ తనకు వ్యతిరేక వర్గంగా ముద్రపడిన వారందరినీ పార్టీ పదవుల నుంచి తప్పిస్తూ వస్తున్న విషయం తెల్సిందే. ఈకోవలోనే ముఖ్యమంత్రి పళనిస్వామిని పార్టీ జిల్లా కార్యదర్శి పదవిని నుంచి ఆదివారం ఆయనను తప్పించారు. 
 
అంతేకాక పళని, పన్నీర్ వర్గానికి చెందిన పలువురిని తప్పించి వారి స్థానంలో తన మద్దతుదారులను వివిధ పదవుల్లో నియమించారు. దినకరన్ ఆదేశాలపై పళని, పన్నీర్ వర్గాలు స్పందించాయి. పార్టీ కార్యకలాపాల్లో తలదూర్చే ఎటువంటి అధికారం అతడికి లేదని తేల్చి చెప్పాయి. ఆయన ఆదేశాలు చెల్లవని పేర్కొన్నాయి. 
 
మరోవైపు.. దినకరన్ వైపు చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో పళని, పన్నీర్ వర్గాల్లో గుబులు రేగుతోంది. ఇంకోవైపు ప్రతిపక్ష డీఎంకేతో కలిసి దినకరన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారని, ఈ మేరకు డీఎంకే, దినకరన్ మధ్య ఒప్పందం జరిగినట్టు సీనియర్ అడ్వొకేట్ సుబ్రహ్మణ్యస్వామి చెప్పడంతో తమిళ రాజకీయాలు మరోమారు వేడెక్కాయి