శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (14:57 IST)

కళ్లకు గంతలు కట్టుకున్నారు.. ఐస్‌క్రీమ్ బాక్సులో దాక్కున్నారు..

కళ్లకు గంతలు కట్టుకునే ఆట ఇద్దరు బాలికల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా మసగె గ్రామంలో బుధవారం విషాదాన్ని నింపింది.
 
వివరాల్లోకి వెళితే.. మృతులను భాగ్య(12), కావ్య(7)గా గుర్తించారు. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి కళ్లకు గంతలు కట్టుకునే ఆట ఆడుకునే సమయంలో అక్కడే ఉన్న ఐస్‌క్రీమ్‌ బాక్స్‌లో ఇద్దరు బాలికలు దాక్కున్నారు. అప్పుడే బాక్స్‌ గడియపడింది.
 
వారిద్దరి కోసం ఇతరులు గాలించినా ఫలితం లేకపోయింది. దాదాపు రెండు గంటల తరువాత ఐస్‌క్రీమ్‌ బాక్సును తెరవగా అందులో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.