మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జులై 2022 (16:21 IST)

అక్టోబర్‌ 1 నుంచి కొత్త రకం డిజైన్ల టైర్లు వాడాల్సిందే..

tyres
tyres
అక్టోబర్‌ 1 నుంచి ప్రయాణికుల కార్లు, ట్రక్కులు, బస్సులకు నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన కొత్త రకం డిజైన్ల టైర్లు వాడాలని కేంద్ర రహదారి, రవాణాశాఖ నిర్దేశించింది. 
 
ఇప్పటికే వాడుకలో ఉన్న పాత డిజైన్‌ టైర్లు 2023 ఏప్రిల్‌ 1 నుంచి రోలింగ్‌ రెసిస్టెన్స్‌, వెట్‌ గ్రిప్‌ ప్రమాణాలను, అదే ఏడాది జూన్‌ 1 నుంచి సౌండ్‌ ఎమిషన్‌ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
 
ఈమేరకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  ఇకపై కొత్త టైర్లు రోలింగ్‌ రెసిస్టెన్స్‌, వెట్‌ గ్రిప్‌, రోలింగ్‌ సౌండ్‌ ఎమిషన్‌ విషయాల్లో 'ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌ 142:2019'లో నిర్దేశించినట్లుగా ఉండాలని కేంద్రం పేర్కొంది. ప్యాసింజర్‌ కార్లు, లైట్‌ ట్రక్కులు, ట్రక్కులు-బస్సులకూ ఈ నిబంధనలు వరిస్తాయని తెలిపింది. 
 
ఈ నిబంధనల అమలుతో భారత్‌ కూడా 'యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనమిక్‌ కమిషన్‌ ఫర్‌ యూరప్‌' స్థాయి ప్రమాణాలను ఆచరణలోకి తెచ్చినట్లవుతుందని తెలిపింది. 
 
''టైర్ల రోలింగ్‌ రెసిస్టెన్స్‌లో మార్పులు చేయడంవల్ల ఇంధన వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వెట్‌ గ్రిప్‌లో మార్పులవల్ల టైర్ల బ్రేకింగ్‌ సామర్థ్యం పెరిగి రోడ్లమీద తడి ఉన్నప్పుడు ప్రమాదాలు తగ్గుతాయి'' అని పేర్కొంది.