గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (08:41 IST)

హీరోయిన్ ప్రయాణించే కారు టైర్లకు గాలి తీసేశారు... ఎక్కడ?

Anupama Parameswaran
తెలుగు చిత్రపరిశ్రమలోని హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. "శతమానం భవతి" వంటి మంచి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే, ఈమె ఇటీవల కోదాడ, సూర్యాపేటలో ఓ షాప్ ఓపెనింగ్ వేడుకకు హాజరయ్యారు. 
 
అనుపమ పరమేశ్వరన్‌ను చూసేందుకు వందలాది మంది గుమిగూడారు. ఆమె అందమైన చిరునవ్వుతో ప్రజలను పలకరించారు. స్థానికులు, అభిమానులు తమ మొబైల్ కెమెరాల ద్వారా ఆమె ఆనంద క్షణాలను బంధించేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.  
 
ఈ క్రమంలో ఆమె మరింత సమయం అక్కడే ఉండాలని ఫ్యాన్స్ కోరారు. అయితే, అప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. దీంతో కొందరు అకతాయిలు ఆమె ప్రయాణించే కారు టైర్లలో గాలితీశారు. 
 
అనంతరం షాపు నిర్వాహకులు ఆమెకు మరో కారు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు పంపించారు. ఇప్పుడు ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చేదు ఘటనతో అనుపమ పరమేశ్వరన్‌ ఒకింత షాక్‌కు గురయ్యారు.