అనుపమ పరమేశ్వరన్.పాడిన పాటకు ట్రెమెండస్ రెస్పాన్స్
అనుపమ పరమేశ్వరన్ తన గొంతుతో బటర్ ఫ్లై సినిమా కోసం చక్కటి పాట పాడింది. ఇప్పుడు అదే ఇంటర్నెట్‌లో న్యూస్ వైరల్ అవుతుంది. బటర్ ఫ్లై చిత్రంలో తొలి పాటను అనుపమ తన శ్రావ్యమైన గొంతుతో ఆలపించించారు. ఆల్ ది లేడీస్.. అంటూ సాగే ఈ పాటను ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు.
బటర్ ఫ్లై చిత్రాన్ని నిర్మించిన జెన్ నెక్ట్స్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ తమ బ్యానర్‌లో రూపొందించిన తొలి చిత్రం మంత్ర. ఈ చిత్రంలో ఛార్మి కౌర్ ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అందులో మాహా మాహా .. అంటూ సాగే పాటను ఛార్మినే పాడారు. ఆ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు జెన్ నెక్ట్స్ అనుపమ పరమేశ్వరన్‌తో బటర్ ఫ్లై చిత్రం కోసం తొలిసారి పాటను పాడించడం విశేషం.
చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో బ్యూటీఫుల్‌గా పాటలు పాడుతూ తన ఫాలోవర్స్‌ను ఆశ్చర్యపరుస్తూ వస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఆల్ ది లేడీస్ అంటూ సాగే పాట ద్వారా సింగర్‌గా పరిచయం అయ్యారు. ఈ అందమైన పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు.