రౌడీ బాయ్స్’కు దేవిశ్రీ తర్వాత తనే సెకండ్ హీరోః నిర్మాత దిల్‌రాజు
నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా రౌడీ బాయ్స్. దిల్‌రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. ఈ సినిమా టీజర్ హైదరాబాద్‌లో జరిగింది.
చిత్ర దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి మాట్లాడుతూ రౌడీబాయ్స్‌లో 9 పాటలున్నాయి. అన్ని పాటలు ఆడియెన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటాయి. అందులో రెండు కాలేజీ ఫెస్ట్ సాంగ్స్. ఈ సినిమా రిలీజ్ తర్వాత కాలేజీ ఫెస్ట్స్‌లో ఆ సాంగ్సే ప్లే అవుతాయని అనుకుంటున్నాను. దేవిశ్రీప్రసాద్‌గారితో పనిచేయడం అనేది నా కలను నేరవేర్చిన దిల్‌రాజుగారికి థాంక్స్ అన్నారు.
హీరో ఆశిష్ మాట్లాడుతూ టైటిల్ సాంగ్ అందరికీ నచ్చిందనే భావిస్తున్నాను. అనుపమ కొన్ని కారణాలతో ఈవెంట్‌కు రాలేకపోయింది. తన వల్ల, దేవిశ్రీప్రసాద్‌గారి వల్ల, దిల్‌రాజుగారి వల్ల ఈ సినిమాకు చాలా మంచి క్రేజ్ వస్తుంది. డైరెక్టర్ హర్షకు థాంక్స్. నా లుక్ విషయంలో కేర్ తీసుకున్న అక్కయ్యకు థాంక్స్. థియేటర్స్‌లో కలుద్దాం అన్నారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, ఈ సినిమా హీరో దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే అందరూ కొత్త వాళ్లతో సినిమా చేస్తున్నప్పుడు ఆడియెన్స్‌ను థియేటర్స్‌కు రప్పించాలంటే ఫస్ట్ అందరినీ మెప్పించేది మ్యూజిక్కే.తను ఒక వారం టైమ్ తీసుకుని మ్యూజిక్ చేయడానికి ఓకే ఆలోచించకుండా సరేనన్నాడు. కథ విన్న తర్వాత నుంచి దేవిశ్రీ ప్రసాద్ సినిమాతో ట్రావెల్ అవుతున్నాడు. హుషారు తర్వాత హర్ష చేస్తున్న చిత్రమిది. మా బ్యానర్‌లో వస్తున్న యూత్ మూవీ ఇది. అనుపమ పరమేశ్వరన్ ఇది వరకు శతమానం భవతి, హలోగురూ ప్రేమకోసమే చిత్రాలను మా బ్యానర్‌లో చేసింది. ఈ సినిమా స్టార్ట్ చేయడం కంటే ముందు అనుపమ..ఇద్దరి హీరోలకంటే పెద్ద వ్యక్తిగా కనిపిస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ, తను ఎక్స్‌ట్రార్డినరిగా చేస్తుందని నేను నమ్మాను. దేవిశ్రీ తర్వాత తనే సెకండ్ హీరో. రేపు సినిమా థియేటర్స్‌లో మీకే అర్థమవుతుంది. ఫస్ట్‌లుక్ విడుదల చేసినప్పుడు పక్కింటి కుర్రాడిలా ఉన్నాడని అందరూ అనుకున్నారు. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత డాన్సులు బాగా చేశాడని అందరూ అప్రిషియేట్ చేశారు. దసరాకు సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
దిల్‌రాజు ఇంటిముందు ధర్నా చేస్తా
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ సినిమాకు మ్యూజిక్ చేస్తానని చెప్పడానికి వారం రోజుల సమయం తీసుకోలేదు. వెంటనే ఓకే చెప్పాను. మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుని ఉండుంటే నేను వారింటి ముందు దర్నా చేసేవాడిని. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న ఆశిష్‌కు అభినందనలు. హర్షతో వర్క్ చేయడం హ్యాపీ. తను యూత్‌ఫుల్‌గా ఈ సినిమాను చేశాడు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా నచ్చే సినిమా. ఇప్పటి వరకు చాలా యూత్‌ఫుల్ సినిమాలు చూశాం. ప్రతి ఐదేళ్లకో, పదేళ్లకో యూత్‌ఫుల్ ఫిల్మ్ వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మళ్లీ అలా యూత్ అందరూ కలిసి నవ్వుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి, కాలేజీ డేస్‌ను ఈ సినిమాతో గుర్తు చేసుకుంటారు. ఆశిష్, విక్రమ్ అందరూ అద్భుతంగా చేశారు. ఆశిష్ పెర్ఫామెన్స్ చూస్తే ఫస్ట్ సినిమాకే ఇంత బాగా చేస్తున్నాడేంటనిపించింది. ఆశిష్ గొప్పగా నటించాడు. విక్రమ్ పోటాపోటీగా నటించాడు. అనుపమ చాలా బాగా చేసింది. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ అన్నారు.