బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 నవంబరు 2024 (13:09 IST)

ఇకపై వచ్చే తుఫానులన్నీ తీవ్ర ప్రభావం చూపుతాయి...

cyclone
ఇకపై వచ్చే తుఫానులన్నీ మరింతబలంగా ఉంటాయని కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రవిచంద్రన్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సముద్రాలలో మరింత వడగాడ్పులు వెలువడనుండటంతో ఇకపై తుఫానులన్నీ బలంగా ఉంటూ తీరని నష్టాలను కలిగించే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. 
 
చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వ్యవస్థాపక దినోత్సవం శనివారం జరిగింది. ఇందులో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, రాబోయే రోజుల్లో తుఫానులన్నీ బలంగానే ఉంటాయని, ఉష్ణోగ్రత అధికంకావటం వల్ల మేఘాలన్నీ అధికంగా నీటిని మోసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయని, దీని ప్రభావంతో వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయన్నారు. 
 
నెలల తరబడి ఈ మెరైన్ హీట్ వేవ్ కొనసాగుతుండటం వల్ల తుఫానులన్నీ ఇక మరింత బలంతో దూసుకువస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఓటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ రామకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీప్ ఓషన్ మిషన్‌లో భాగంగా లోతైన సముద్ర సూక్ష్మజీవులు, సముద్ర జీవులు సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్‌ను ఆయన ప్రారంభిం చారు.