సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2023 (19:41 IST)

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

Car
Car
పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆరు వాహనాలు ఒకదాంతో ఒకటి ఢీకొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 24మందికి గాయాలైనాయి. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమయంగా ఉంది. 
 
పొగమంచు కారణంగా మొదట ఓ డబుల్ డెక్కర్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. బస్సు వెనుక వస్తున్న ఇతర వాహనాలు కూడా దారి కనిపించక డబుల్ డెక్కర్ బస్సును ఢీకొన్నాయి. అలా ఆరు వాహనాలు ఒకదాంతో ఒకటి ఢీకొన్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
అంతేకాకుండా సదరు వాహనాలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో బస్సులోని ఓ ప్రయాణికుడు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.