శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (12:06 IST)

ఆధార్ నంబర్ వెరిఫికేషన్‌కు యూపీఎస్సీకి కేంద్రం అనుమతి!

aadhaar
మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేదర్ మోసపూరిత విధానంలో ఎంపికైనట్టు నిర్ధారణైంది. దీంతో యూపీఎస్సీ ఆమెను డీబార్ చేసింది. అయితే, ఈ వ్యవహారంతో అభ్యర్థల గుర్తింపు విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహారించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా అభ్యర్థి ఆధార్ వెరిఫికేషన్‌ చేసేలా యూపీఎస్సీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇలా అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి. దీంతో అభ్యర్థులకు సంబంధించిన వివరాలు నమోదుతో పాటు పరీక్ష వివిధ దశలు, రిక్రూట్మెంట్ సమయంలో కూడా అభ్యర్థుల గుర్తింపునకు ఆధార్ ఆధారిత వేరిఫికేషన్‌ను యూపీఎస్సీ ఉపయోగించనుంది.
 
ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ దశల పరీక్షతో పాటు రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించేందుకు స్వచ్ఛంద ప్రాతిపదికన 'వన్ టైమ్ రిజిస్ట్రేషన్' పోర్టల్‌పై యూపీఎస్సీ ఆధార్ వెరిఫికేషన్‌న్ను చేయనుందని తెలిపింది. ఈ మేరకు అనుమతి ఇచ్చామని వివరించింది. యూఐడీఏఐ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా యూపీఎస్సీ ఆధార్ పరిశీలన చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
 
అర్హత విషయంలో మోసానికి పాల్పడ్డారనే కారణంతో గత నెలలో ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌ను యూపీఎస్సీ డీబార్ చేసిన విషయం తెల్సిందే. అంగ వైకల్యం సర్టిఫికేట్‌తో పాటు ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) కోటా విషయంలోనూ పూజా ఖేద్కర్ దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. వీటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం యూపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో అన్ని పరీక్షల నుంచి ఆమెను డిబార్ చేస్తున్నట్టు స్పష్టం చేసింది.