గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (12:08 IST)

UPSC నోటిఫికేషన్ విడుదల: 861 పోస్టుల భర్తీ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీస్ పరీక్ష (సీఎస్ఈ) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సివిల్ సర్వీసుల (IAS, IPS)కు చెందిన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 
 
ఈ నోటిఫికేషన్‌ ద్వారా 861 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
 
పోస్టుల వివరాలు: 
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2022
మొత్తం ఖాళీలు: 861
అర్హతలు: అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే.
 ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు స్టేజిలలో జరుగుతుంది.