శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (08:40 IST)

యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

భారతదేశంలోని 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)& నేవల్ అకాడమీ (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ (I)- 2020'కు సంబంధించిన నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జనవరి 8న విడుదల చేసింది. ఈ ఎగ్జామ్ ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
 
ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతి ఏడాది రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాదిలో మొదటిసారి ఏప్రిల్ 19న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ  నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం ఖాళీలు 418 భర్తీ చేయనున్నారు.
 
నోటిఫికేషన్‌ వివరాలు....
నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ (ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్)-I, 2020
 నేషనల్ డిఫెన్స్ అకాడమీ (145వ బ్యాచ్‌): 370 పోస్టులు
విభాగాల వారీగా ఉన్న ఖాళీలు: ఇండియన్ ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-120.
నేవల్ అకాడమీ (107వ బ్యాచ్‌): 44 పోస్టులు (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్)
 
అర్హతలు:  ఆర్మీ ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఇంటర్మీడియేట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎయిర్‌ఫోర్స్, నేవల్ ఉద్యోగాలకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లతో ఇంటర్మీడియేట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
 
వయోపరిమితి: అర్హత గాల అభ్యర్థులు 02.07.2001 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. కేవలం అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాడానికి అర్హులు.
 
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా మొత్తం రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. సరైన అర్హతలు కలిగిన వారు నిర్ణీత గడువు లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 
ఎంపిక విధానం:  అభ్యర్థులకు రాతపరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికలు చేస్తారు.
 
రాత పరీక్ష:  మొత్తం 900 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లుంటాయి. పేపర్-1(మ్యాథమెటిక్స్)కు 300 మార్కులు, పేపర్-2(జనరల్ ఎబిలిటీ టెస్ట్)కు 600 మార్కులు ఉంటాయి. ఒక్క పేపర్‌కు 150 నిమిషాలు కేటాయించారు.  రాతపరీక్షలో ఎంపికైనవారికి SSB టెస్ట్/ ఇంటర్వ్యూ లు ఉంటాయి. మొత్తం 900 మార్కులకు ఇంటర్వ్యూ  ఉంటుంది.
 
శిక్షణ : నేవల్ అకాడమీకి ఎంపికైన వారికి ఎజిమల(కేరళ)లోని 'ఇండియన్ నేవెల్ అకాడమీ'లో నాలుగేళ్ల పాటు శిక్షణ ఉంటుంది. 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు బీటెక్ డిగ్రీని ప్రధానం చేస్తారు.
 
ఎన్‌డీఏలో విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకొన్న తర్వాత ఆర్మీ అభ్యర్థులను డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీకి, నేవల్ అభ్యర్థులను ఇండియన్ నేవల్ అకాడమీ(ఎజిమల)కి, ఎయిర్‌ఫోర్స్ అభ్యర్థులను హైదరాబాద్‌లోని ఏఎఫ్‌ఏకు పంపిస్తారు. వీరికి ఆయా విభాగాల్లో ఏడాది పాటు శిక్షణ ఇచ్చి అనంతరం లెఫ్ట్‌నెంట్ హోదాలో ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారు.
 
స్టైపెండ్:  శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు రూ. 21,000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు.
 
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 08.01.2020 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ 28.01.2020. (6:00 PM)
 
దరఖాస్తుల ఉపసంహరణ: 04.02.2020 to 11.02.2020, రాత పరీక్ష నిర్వహించే తేదీ 19.04.2020.