బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (19:17 IST)

మంత్రులు ముందు ఆస్తుల్ని ప్రకటించండి.. సీఎం యోగి ఆదేశాలు

yogi adityanath
యోగి ఆదిత్యనాథ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు పొందుపరిచారు. 
 
తాజాగా తన మంత్రివర్గ సహచరులకు ఆదేశాలిచ్చారు. మంత్రులు తమ సొంత ఆస్తులతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను మూడు నెలల్లోగా ప్రకటించాలని ఆదేశించారు. 
 
లిక్విడ్ క్యాష్, బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో తనకు రూ.1.54 కోట్ల ఆస్తులున్నట్టు అందులో యోగి డిక్లేర్ చేశారు.
 
యోగి ఆదిత్యనాథ్ గత మార్చి 25న వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 52 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.