శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2023 (17:26 IST)

అలీఘర్ యూనివర్సిటీ క్యాంపస్‌.. శునకాల దాడిలో వ్యక్తి మృతి

Black Dogs
Black Dogs
అలీఘర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ వ్యక్తిపై కుక్క దాడికి పాల్పడిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ శునకాల దాడికి సంబంధించిన విజువల్స్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అక్కడ కుక్కల గుంపు ఆ వ్యక్తి వద్దకు వచ్చి, విశ్వవిద్యాలయంలోని పార్కులో చుట్టొచ్చాయి. 
 
ఈ ఘటనలో తీవ్రగాయపడిన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, అలీఘర్ పోలీసుల అధికారిక ట్విట్టర్ ఖాతా వీడియో అప్‌డేట్‌ను షేర్ చేసింది.