బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (10:12 IST)

విపత్కర పరిస్థితుల్లో మీ ఆశీర్వాదాలు కావాలి: కంగనా

"ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఏడు నెలల తర్వాత షూటింగ్‌లో పాల్గొంటున్నా. ఎంతో ఆసక్తికరమైన `తలైవి` సినిమా కోసం దక్షిణాదికి పయనమవుతున్నా. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మీ ఆశీర్వాదాలు కావాలి" అంటూ ట్వీట్ చేసింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న `తలైవి` చిత్రంలో కంగన నటిస్తున్న సంగతి తెలిసిందే.  లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన ఆ సినిమా షూటింగ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది.

ఆ షూటింగ్‌లో పాల్గొనడం గురించి కంగన తాజాగా ట్వీట్ చేసింది. లాక్‌డౌన్ సమయంలో పలు వివాదాలతో తీరిక లేకుండా గడిపిన కంగనా ఇక షూటింగ్‌తో బిజీ కానుంది.