గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 20 జూన్ 2019 (19:37 IST)

200 రోజుల తర్వాత #chennairains.. క్రికెటర్ హ్యాపీ ట్వీట్ (video)

వేసవి కాలంలో భగ్గుమన్న ఎండలు. వేసవితో వీచిన వేడి గాలులతో అష్టకష్టాలు పడిన చెన్నై వాసులకు 200 రోజుల తర్వాత వర్షాలు కురిశాయి. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి చిరు జల్లులు కురిశాయి. వర్షాలు కురవకపోవడంతో నీటి కొరతతో తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా చెన్నై ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. నీటి కొరతతో ఐటీ, పాఠశాలలు, హోటళ్లు మూతపడుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో దాదాపు 200 రోజులకు తర్వాత చెన్నైలో వర్షాలు కురిశాయి. ఈ నెల 21వ తేదీ నుంచి చెన్నైలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో.. ఒక రోజుకు ముందుగానే చెన్నైలో వర్షాలు పడటం ప్రజలకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక చెన్నైలో కురిసిన వర్షాలను ఫోటోలుగా వీడియోలు చాలామంది ప్రజలు, సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో చెన్నై స్టార్, టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన ట్విట్టర్‌లో వర్షం కురిసినప్పుడు తీసిన వీడియోను హ్యాపీగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అలాగే చెన్నై రైన్స్ అంటూ ఇప్పటికే ట్విట్టర్‌లో హ్యాష్ ట్యాగ్ కూడా వచ్చేసింది.