Woman: చికెన్ వండలేదని భార్యను హత్య చేశాడు.. దుప్పటిలో చుట్టి గంగానదిలో పారేశాడు
భార్యాభర్తల గొడవలు ప్రస్తుతం హత్యలకు దారితీస్తున్నాయి. క్షణికావేశానికి కోపానికి గురై భాగస్వాములను దారుణంగా హత్య చేస్తున్నారు. తాజాగా యూపీలో భార్యను భర్త హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో 21 ఏళ్ల రీనా అనే యువతికి వివాహం జరిగింది.
అయితే ఇంట్లో చికెన్ వండకుండా వెజ్ కర్రీ వండినందుకు ఓ భర్త భార్యపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ క్రమంలో ఆ భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది చికెన్ వండలేదని కాదని, వరకట్న హత్య అని కుటుంబ సభ్యులు అంటున్నారు. కావాలనే భర్త ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
భార్యను చంపిన తర్వాత నిగమ్ బంధువుల సహాయంతో రీనా మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి మట్టితో నింపి, గంగానదిలో పడేశాడు. ఆపై భార్య కనిపించలేదని డ్రామా చేసాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరపడంతో భర్తే హంతకుడిని తేలింది. నిగమ్‌తో పాటు అతని బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కఠిన శిక్ష విధించాలని బాధితరాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.