శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (08:29 IST)

డబ్బు చెల్లించి కొనుక్కున్న వధువు జంప్.. ఎక్కడ?

సాధారణంగా వివాహాలు స్వర్గంలో నిశ్చయమవుతాని పెద్దలు చెబుతుంటారు. కానీ, డబ్బులు చెల్లించి కొనుక్కున్న (ఎదురుకట్నం) వధువు రెండు వారాల పాటు కాపురం చేసి పారిపోయింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భరత్ పూర్ జిల్లా నాగ్లామాదర్ గ్రామానికి చెందిన నారాయణ్ సింగ్ గుర్జర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాకు చెందిన వధువు సునీత తండ్రికి రూ.3లక్షలు చెల్లించి వివాహమాడారు.
 
వివాహం అనంతరం రెండు వారాలు కాపురం చేసిన సునీత ఇంట్లో ఒంటరిగా వదిలి పనిమీద భర్త నారాయణ్ సింగ్ బయటకు వెళ్లాడు. భర్త సింగ్ తిరిగి వచ్చేటప్పటికీ భార్య సునీత ఇంట్లో లేదు. 
 
తాను రూ.3 లక్షలు చెల్లించి కొని పెళ్లాడిన భార్య సునీత ఇంటి నుంచి పారిపోయిందని భర్త నారాయణ్ సింగ్ అత్తింటివారికి చెప్పారు. సునీత తండ్రి, సోదరుడు ఆమె గురించి తమకు తెలియదని చెప్పడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారిపోయిన భార్యపై భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.