ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (10:24 IST)

ప్రపంచ సింహాల దినోత్సవం : ప్రధాని మోడీ గ్రీటింగ్స్

ఆగస్టు 10వ తేదీ వ‌ర‌ల్డ్ ల‌య‌న్ డే (#WorldLionDay). ప్ర‌పంచ సింహాల దినోత్సవం సంద‌ర్భంగా ప్ర‌ధాని నరేంద్ర మోడీ గ్రీటింగ్స్ తెలిపారు. త‌న ట్విట్ట‌ర్‌ ఖాతాలో ఆయ‌న రియాక్ట్ అయ్యారు. ఆసియాటిక్ సింహాల‌కు భార‌త్ నిల‌యం కావ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. 
 
అయితే గ‌త కొన్ని ఏళ్ల నుంచి భార‌త్‌లో సింహాల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంద‌ని ఆయ‌న తెలిపారు. ఇది సంతోష‌క‌ర విష‌య‌మ‌న్నారు. కేంద్ర అట‌వీశాఖ మంత్రి భూపేంద్ర యాద‌వ్ కూడా స్పందించారు. వ‌ర‌ల్డ్ ల‌య‌న్ డే నాడు ఓ గొప్ప సంర‌క్ష‌ణా స‌క్సెస్ సోర్టీ చెప్పాల‌న్నారు. 
 
గుజ‌రాత్‌లో సుమారు 30 వేల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో సుమారు 674 ఆసియాటిక్ సింహాలు ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. ఒక‌ప్పుడు త‌న ఉనికిని కోల్పోయిన ఆ సింహాలు ఇప్పుడు త‌మ ప్రాంతాన్ని మ‌ళ్లీ ఆక్ర‌మిస్తున్న‌ట్లు తెలిపారు. ఇదే రీతిలో సింహాల సంర‌క్ష‌ణ కొన‌సాగాల‌న్నారు.