గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (17:27 IST)

యువకుడిని వేధించిన యువతి.. డబ్బులు ఇవ్వకపోతే.. మార్ఫింగ్ ఫోటోలను..?

ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఓ యువతి యువకుడిని వేధించింది. ఓ యువతి అపరిచిత యువకుడికి మార్ఫింగ్‌ ఫోటోలు పంపి బ్లాక్‌మెయిల్‌ దిగింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో మాగడి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాగడి పట్టణానికి చెందిన వ్యక్తికి రెండు రోజుల క్రితం అపరిచిత నంబర్‌ నుండి కాల్‌ వచ్చింది. 
 
ఆ వాట్సాప్‌ కాల్‌లో కొద్దిసేపు అవతలి వ్యక్తితో మాట్లాడిన అతనికి... తరువాత అదే నెంబర్ నుంచి.. ఓ యువతితో తాను సన్నిహితంగా ఉన్నట్టు మార్ఫింగ్‌ ఫోటోలు, చాటింగ్‌ వీడియోలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా హతాశుడైన అతనికి డబ్బులు పంపించాలంటూ మరో సందేశం వచ్చింది.
 
 డబ్బులు ఇవ్వకుంటే ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని మేసేజ్‌ వచ్చింది. దీంతో బాధితుడు పోలీసులను అశ్రయించాడు. ఇది ఫోటోలను ఓ యువతి మార్ఫింగ్ చేసి అతనికి పంపినట్లు ప్రాథమికంగా నిర్థారించిన పోలీసులు లోతైన దర్వాప్తు జరుపుతున్నారు.