1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. End of Ajit Agarkar era? BCCI looking for new chief selector for Indian cricket team

భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టరుగా అజిత్ అగర్కార్ పదవీకాలం ముగిసినట్టేనా?

ajit agarkar
భారత క్రికెట్ జ్టటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి కాలంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించింది. గురువారం జరిగిన కీలక సమీక్ష సమావేశానికి అగార్కర్ హాజరుకాకపోవడంతో.. ఆయన పదవీకాలంపై పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ ప్రచారాలను కొట్టిపారేశారు.
 
ఈ సమావేశానికి టెస్టులు, వన్డేలకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, టీ20లకు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరయ్యారు. బీసీసీఐ ఉన్నతాధికారులతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రికెట్ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. అయితే అగార్కర్ మాత్రం ప్రత్యక్షంగాగానీ, ఆన్‌లైనులోగానీ సమావేశానికి హాజరు కాలేదు.
 
దీంతో అగార్కర్ పదవీకాలం కొనసాగుతుందా? ఆయనకు పొడిగింపు ఇస్తారా? అన్న చర్చ మొదలైంది. దీనిపై సైకియా స్పష్టత ఇచ్చారు. అగార్కర్ నగరంలో లేరని చెప్పారు. సమావేశాన్ని చాలా తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేయడంతో ఆయన హాజరు కాలేకపోయారని తెలిపారు. ఆన్‌లైనులో పాల్గొనేందుకు ప్రయత్నించినా.. ఆయన ఉన్న ప్రాంతంలో అది సాధ్యం కాలేదన్నారు.
 
అగార్కర్‌కు చీఫ్ సెలెక్టర్‌గా పొడిగింపు ఇవ్వడంపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని సైకియా స్పష్టం చేశారు. అలాగే వీవీఎస్ లక్ష్మణు బీసీసీఐ క్రికెట్ డైరెక్టర్‌గా నియమించే అంశంపైనా ఎలాంటి చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
క్యాబ్ డ్రైవర్‌, కూరగాయలు అమ్ముకుంటున్న త్రో బాల్ ప్లేయర్ అమర్‌దీప్ (video)