శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 4 అక్టోబరు 2019 (21:36 IST)

దేవీ నవరాత్రుల సమయంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి ఎందుకు తినకూడదు?

విజయ దశమి... దసరా పండుగను నవరాత్రులుగా జరుపుకోడం తెలిసిందే. ఈ నవరాత్రుల సమయంలో వ్రతం ఆచరించేవారు పెద్దవుల్లిపాయ, వెల్లుల్లిని తినడం మానేస్తారు. ఆహార పదార్థాల్లో ఈ రెండు లేకుండా చూసుకుని తింటుంటారు. ఇలా ఎందుకు చేస్తారనే దాని వెనుక సైంటిఫిక్ కారణాలు వున్నాయి.
 
ఉల్లిపాయ, వెల్లుల్లి ప్రత్యేకమైనవి. ఇవి శరీర శక్తిని ప్రేరేపిస్తాయి. ఉల్లిపాయలు శరీరంలో వేడిని కూడా ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల నవరాత్రి ఉపవాస సమయంలో ఈ కారణంగా ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం వుంది. అందువల్ల వీటిని తీసుకోరు.
 
ఉల్లిపాయతో పాటు వెల్లుల్లిని కూడా తినరు. ఈ చిన్నుల్లి తినడం వల్ల సదరు వ్యక్తి వారి ప్రవృత్తిపై పట్టు కోల్పోయేలా చేస్తుంది. ఇది కోరికలు గతి తప్పేలా చేస్తుంది కనుక దీన్ని కూడా ముట్టుకోరు. కేవలం భక్తిభావంతో నవరాత్రుల సమయంలో అమ్మవారిని కొలుస్తారు.