1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2014 (15:33 IST)

చికెన్ పకోడీ ఎలా చేయాలి?

రెస్టారెంట్లు, ఎంఎస్‌జీ వంటకాలను అధికంగా తీసుకోవడం కొందరికి నచ్చదు. హోం మేడ్ ఫుడ్ తీసుకోవడమే ఆరోగ్యానికి ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నాన్ వెజ్ రెస్టారెంట్ల కంటే ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకోవడం ఉత్తమం. 
 
చికెన్ ఫ్రై, మటన్ ఫ్రైలకు ఉపయోగించే నూనెలతో ఆరోగ్యానికి దెబ్బేనని న్యూట్రీషన్లు అంటున్నారు. అందుచేత రెస్టారెంట్లు, రోడ్డు పక్కన దుకాణాల్లో అమ్మే నాన్ వెజ్ ఫ్రైను టేస్ట్ చేయొద్దంటున్నారు.
 
ఈ క్రమంలో చికెన్ 65, చికెన్ పకోడీలంటే తెగ ఇష్టపడే వారు వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసే వంటకాలతో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని వారు సలహా ఇస్తున్నారు. 
 
చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం.  
 
చికెన్: ఒక కేజీ, 
జీలకర్ర: వేయించి పొడి చేసింది : అర టీ స్పూన్ 
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మ ఉప్పు(లెమన్ డ్రెస్స్): ఒక టేబుల్ స్పూన్ 
కారం: ఒక టేబుల్ స్పూన్ 
 
 
పిండి తయారీకి కావల్సినవి
నీరు : ఒక కప్పు 
ఉప్పు: రుచికి సరిపడా
శనగపిండి: ఒక కప్పు 
బేకింగ్ పౌడర్: అర టీ స్పూన్ 
కారం: అర టీ స్పూన్ 
కరివేపాకులు : నాలుగు రెమ్మలు
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)
 
తయారీ విధానం:  ముందుగా ఒక కప్పు నీటిలో కొద్దిగా ఉప్పు వేసి చికెన్ ముక్కలు ఉడకబెట్టాలి. 2. ఉడికిన తరువాత నీటిని పూర్తిగా వడపోసి జీలకర్ర పొడి, ఉప్పు, నిమ్మ ఉప్పు, కారంలో బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. 
 
తరవాత ఒక గిన్నెలో శనగపిండిని బజ్జీలపిండిలా చిక్కగా కలుపుకొవాలి. అందులోనే కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, కారం, ఉప్పు తగినంత, బేకింగ్ పౌడర్ కలిపి చికెన్ ముక్కలను పిండిలో ముంచి నూనెలో దోరగా వేపుకోవాలి. అంతే చికెన్ పకోడా రెడీ.. చికెన్ పకోడాను చిల్లీ సాస్ లేదా వైట్ రైస్‌కు సైడిష్‌గా వాడుకోవచ్చు.