బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 19 జులై 2016 (18:41 IST)

తెలంగాణ ఎన్నారై ఫోరం (TeNF) ఆధ్వర్యంలో ఘనంగా 2016 లండన్‌ బోనాల పండుగ

లండన్ : తెలంగాణ ఎన్నారై ఫోరం (TeNF) ఆధ్వర్యంలో 2016 లండన్‌ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 800లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరు అయినారు. ఈ వేడుకలకు తెలంగాణా రాష్ట్రం నుండి M.L.C ఎన్. రాంచందర్ రావు గారు మరియు

లండన్ : తెలంగాణ ఎన్నారై ఫోరం (TeNF) ఆధ్వర్యంలో 2016 లండన్‌ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 800లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరు అయినారు. ఈ వేడుకలకు తెలంగాణా రాష్ట్రం నుండి M.L.C ఎన్. రాంచందర్ రావు గారు మరియు కల్వకుర్తి M.L.A చల్ల  వంశీ చందర్ రెడ్డి, బ్రిటన్ ఎంపీ వీరేంద్ర శర్మ, హిల్లింగ్డన్ మేయర్ ముఖ్య అతిథులుగా హాజరవడం విశేషం.
 
స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు లష్కర్ బోనాలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్థానికులని కూడా ముగ్దులని చేసింది. బోనాల ఊరేగింపు తరువాత ఏర్పాటు చేసిన వేడుకల సభలో ముందుగా సంస్థ అద్యక్షులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో మొదటిసారి బోనాల పండుగ హైద్రాబాద్ వాసిగా ముందు ఉండి చేయడం అది కూడా పిడికెడు మందితో మొదలైన ఈ వేడుక ఈ సంవత్సరం దాదాపు వందల మందితో  ఊరేగింపు లష్కర్ బోనాలకు ఏ మాత్రం తీసిపోకుండా చేయడం నూతన ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. 
 
వ్యవస్థాపక సభ్యులు గంప వేణు గోపాల్ మాట్లాడుతూ ఈ సంస్థ చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాల గురించి మరియు రాబోయే రోజులో సంస్థ చేయబోయే వివిధ కార్యక్రమాల గురించి వివరించారు, తెలంగాణా ఎన్నారై ఫోరమ్ తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచంలో ఉన్న తెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
 
వ్యవస్థాపక సభ్యులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ తొట్టెల ఊరేగింపు యొక్క ప్రాముఖ్యత మరియు సంస్థ తెలంగాణ సంస్కృతిని ఇంగ్లాండ్ నలుమూల ఏవిధంగా విస్తరించినది మరియు యూరోప్‌లో ఇదేవిధంగా విస్తరిచేందుకు ఉన్న ప్రణాళికను సభాముఖంగా తెలియచేసినారు. ఈ బోనాల వేడుకల్లో బాగస్వామ్యులైన ఇతర సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. 
 
ముఖ్య అతిథులు ముందుగా వంశీ చందర్‌రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ఎన్నారై ఫోరం చేస్తున్న బోనాల పండుగ ఊహకి మించి ఆనందాన్ని ఇచ్చిందని, మరియు తెలంగాణ ఎన్నారై ఫోరం చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మరియు వారి జిల్లాలో చేస్తున్న వివిధ కార్యక్రమాలు గురించి ఆ యొక్క ఆలోచన పంథాను సంస్థలో ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. తెలంగాణ ఎన్నారై ఫోరం వారి ఆతిథ్యం తనకు మరియు సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని అభిప్రాయపడ్డారు.
 
తరువాత MLC ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ... తెలంగాణ రాకముందు 2014 బోనాలకి తనను ముఖ్యఅతిథిగా పిలిచినప్పుడు నేను ఒక వాగ్దానం చేసాను. 2015లో మీరు బోనాలు తెలంగాణ కొత్త రాష్ట్రంలో చేసుకుబోతున్నారు అని అన్నానని, అదేవిధంగా జరిగింది అనీ, మళ్ళీ ఈ సంవత్సరం బోనాలకు రావడం చాలా ఆనందంగా ఉందని, అలాగే ఉద్యమ సమయంలో తెలంగాణా ఎన్నారై ఫోరమ్ లండన్ వీధుల్లో "జై తెలంగాణా" అంటూ చేసిన పోరాటం మాకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఈ బోనాలు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా రాష్ట్రంలో వున్నట్టుగా అనిపించిందని, తెలంగాణా సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్తున్న తీరుని ప్రశంసించారు. ఒకపక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజువారి పనుల్లో ఉన్నప్పటికి, బాధ్యత గల తెలంగాణా బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో నేడు పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర నాకు ఎంతో స్పూర్తినిస్తుందని తెలిపారు.
 
బ్రిటన్ ఎంపీ వీరేంద్ర శర్మ స్వాగతోపన్యాసం ఇస్తూ భారత - యూకే దేశాల మధ్య ఉన్న మంచి వ్యాపార అనుకూల విధానాల గురించి వివరించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని హాజరైయన తెలంగాణా ప్రతినిథులని కోరారు. తెలంగాణా ఎన్నారై ఫోరమ్ ప్రతినిథులు M.L.C ఎన్. రాంచందర్ రావు గారిని మరియు కల్వకుర్తి M.L.A చల్ల వంశీ చందర్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందచేశారు. తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించింది.
 
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేస్తున్నామని వైస్ ప్రెసిడెంట్ పవిత్ర రెడ్డి తెలిపారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో ప్రశంశించారు. అడ్విసోర్ ఇంచార్జి ఉదయ్ నాగరాజు, సభ్యులు ప్రమోద్ అంతాటి, గోలి తిరుపతి సంస్థ విధివిధానాల గురించి వివరంగా వివరించారు. సంయుక్త కార్యదర్శి రంగుల సుధాకర్ మరియు సుప్రజ రెడ్డి అధ్యక్షతన జరిగిన బోనాల పండుగకు తెలంగాణ ఎన్నారై ఫోరం, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి గంగసాని మరియు ఈవెంట్ ఇంచార్జి నగేష్ రెడ్డి కాసర్ల, శ్వేతా రెడ్డి, సంయుక్త కార్యదర్శి రత్నాకర్ కోశాధికారి అశోక్ దూసరి, మీడియా ఇంచార్జి నవీన్ రెడ్డి, ఈవెంట్స్ టీం విక్రమ్ రెడ్డి, వెంకట్ రెడ్డి దొంతుల, ఐ.టి కార్యదర్శి శ్రీకాంత్ జిల్లా, క్రీడాశాఖ కార్యదర్శి నరేష్, స్వాతి బుడగం ఆధ్వర్యంలో జరిగిన బోనాల జాతర ఇంతటి విజయం సాధించడం సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారై ఫోరం, మహిళా విభాగం సభ్యులు, మీనాక్షి అంతటి, సుమ, సంధ్య నాగుల, వాణి అనసూరి, అపర్ణ దొంతుల, ఇతర కమిటీ సభ్యులు హరిగౌడ్, రంగు వెంకట్, శివాజీ షిండే, శ్రీధర్ రావు, సురేష్ బుడగం, రాజేష్ వర్మ , రాజ్ బజార్, శివ నారపాక, స్వామి ఆశ, సత్య పాల్గొన్నవారిలో వున్నారు.