శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2015 (15:25 IST)

రాజధానికి అమరావతి పేరు.. స్వాగతించిన టీడీపీ ఎన్నారైలు

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి చారిత్రాత్మక పేరు, ప్రత్యేకత కలిగిన అమరావతి పేరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల టీడీపీ ఎన్నారైలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ స్వాగతించారు. ఈ మేరకు కాలిఫోర్నియాలో ఫ్రీమాంట్ నగరంలో ఎన్నారై టీడీపీ నేతల సమావేశం గత శుక్రవారం సాయంత్రం జరిగింది.
 
ఈ సమావేశంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొని ప్రసంగించారు. శాతవాహన కాలంలో అమరావతి రాజ్యం సుభిక్షంగా శాంతి సౌభాగ్యాలు, సిరి సంపదలతో తలతూగిన చరిత్ర ఉందని వారు గుర్తు చేశారు. ఆ అమరావతి నగరాన్ని అపుడు ఇంద్రుడు పాలిస్తే.. ఇపుడు చంద్రుడు (చంద్రబాబు) పాలిస్తున్నారంటూ పలువురు టీడీపీ ఎన్నారై నేతలు వ్యాఖ్యానించారు. 
 
అవరావతి నూతన రాజధాని అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ప్రపంచంలోని ప్రసిద్ధిగాంచిన పట్టణంగా కీర్తిని సంపాదిస్తున్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అవరావతి నదీపరివాహక ప్రాంతమైనందున మౌళిక వసతులకు వాస్తుకి, విభిన్న సాంప్రదాయాలకు ఆలవాలమైందన్నారు. 
 
ఈ కార్యక్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావు, శ్రీధర్ నెల్లూరు, నరేష్ మానుకొండ, ప్రేమ్ సాగర్ కనుమూరి, మహేందర్ ఇల్లా, రాజశేఖర్ కొమ్మవారి, నరేన్ బూర్గుల, బాలాజీ దొప్పలపూడి, కిరణ్ నల్లమోతు, శ్రీనివాసరావు చెరుకూరి, రాంబాబు మందడపు, జోహారిక ఉప్పలపాటి, కీర్తి, వినీత, విశాలి, నీరజ తదితరులు పాల్గొన్నారు.