డా. గజల్ శ్రీనివాస్ - "నమోః గంగ" వీడియో గీతం

Ghajal Srinivas
ivr| Last Modified బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (14:32 IST)
(డల్లాస్, అమెరికా): గంగా ప్రక్షాలనపై అవగాహన కలిగించేందుకు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ & సేవ్ టెంపుల్స్ "నమోః గంగ" వీడియో గీతాన్ని నిర్మిస్తోంది. దీనికోసం శ్రీ రసరాజు మరియు శ్రీ సతీష్ శ్రీవాస్తవ్‌లు తెలుగు, హిందీ భాషలలో రచించిన గీతాలను డా. గజల్ శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించి గానం చేసి ఇటీవల రికార్డు చేయడం జరిగింది. పై గీతానికి డా. గజల్ శ్రీనివాస్ అభినయనం చేస్తుండగా వారణాసి, గంగా పరీవాహక ప్రాంతంలో ఈ వీడియో గీతాన్ని 3 రోజుల పాటు 5 అత్యాధునిక కెమేరాలు ఉపయోగించి పాటను చిత్రీకరించడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకులు ప్రొ. వెలగపూడి ప్రకాశరావు తెలిపారు.
 
ఈ వీడియో గీతానికి కేంబూరు సతీష్ కుమార్ దర్శకత్వం వహించారని, తోట రమణ ఛాయాగ్రహణం నిర్వహించారని, అతిత్వరలో గ్రాఫిక్స్, ఎడిటింగ్ పూర్తిచేసుకుని ఈ గీతాన్ని ఢిల్లీలో పెద్దల సమక్షంలో "స్వచ్ఛ గంగ ప్రాజెక్ట్"కి అంకితం చేయనున్నట్లు తెలిపారు.దీనిపై మరింత చదవండి :