ఎన్నారై తెలుగుదేశం ఆధ్వర్యంలో అమెరికాలో ఘనంగా ఎన్టీఆర్ 20వ వర్థంతి

NRI-TDP
ivr| Last Updated: సోమవారం, 18 జనవరి 2016 (10:58 IST)
ఎన్నారై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని బే ఏరియాలో ఎన్టీఆర్ 20వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. 17.01.2016 ఆదివారం అమెరికాలోని బే ఏరియాలో ఉన్న ఫ్రిమోంట్‌లో ఎన్నారైలు ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమ్మినేని రామంచంద్రరావు హాజరై నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎన్నారై తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ... ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడని కొనియాడారు. ఎన్టీఆర్ అందరికీ ఆదర్శప్రియుడనీ, తను ఎంచుకున్న ప్రతి రంగంలోనూ అత్యున్నత శిఖరాలను అధిరోహించారని అన్నారు. తెలుగువారి హృదయాలలో కొలువైన ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ యువత ఆయన అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నించాలన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస రావు కొమ్మినేని, అశోక్ దాచర్ల, గోపి పోలవరపు, పుల్లారావు మందడపు, వెంకట్ కొడాలి, శ్రీధర్ నెల్లూరు, రాంబాబు మందడపు, చిరంజీవి కనగాల, బాలాజీ దొప్పలపూడి, రామచంద్రరావు నల్లమోతు, ఫణి ఉప్పల, వాసు నందిపాటి, నరేంద్ర, చిన్ను, శ్రీకాంత్ నల్లూరి, భార్గవ్ మందపాటి, రవికుమార్ కొండ్రాగుంట తదితరులు పాల్గొన్నారు.దీనిపై మరింత చదవండి :