ఇండియన్ ఐటీ యువతపై ట్రంప్ దెబ్బ మీద దెబ్బ... అమెరికా ఆశలు శుద్ధ దండగేనా?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ పట్టాన విదేశీయులను వదిలిపెట్టడంలేదు. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకుని అమెరికా వెళ్లే ఇండియన్ యూత్ కలలు కల్లలయ్యే పరిస్థితులు తీసుకువస్తున్నారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇండియన్ ఐటీ యువతపై పెద్ద దెబ్బ పడేట్లుగా క

trump
ivr| Last Modified శనివారం, 4 మార్చి 2017 (14:59 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ పట్టాన విదేశీయులను వదిలిపెట్టడంలేదు. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకుని అమెరికా వెళ్లే ఇండియన్ యూత్ కలలు కల్లలయ్యే పరిస్థితులు తీసుకువస్తున్నారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇండియన్ ఐటీ యువతపై పెద్ద దెబ్బ పడేట్లుగా కనబడుతోంది. హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) స్పష్టం చేయడంతో ట్రంప్ చేసిన మరో దారుణమైన నిర్ణయం వెలికి వచ్చింది.

ట్రంప్ ఆదేశాలతో ఏప్రిల్ 3 నుంచి హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ రద్దు కాబోతోంది. ఇది ఆరు నెలలపాటు అమల్లో వుంటుందని చెపుతున్నారు. ఆ తర్వాత కూడా అది శాశ్వత ప్రాతిపదికన ఉండే అవకాశం లేకపోలేదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే ఇక పూర్తిగా అమెరికా వెళ్లాలని అనుకునేవారు ఆ ప్రయత్నాలను మానుకోవాల్సిన పరిస్థితులు ఎదురుకావచ్చు.

సాధారణంగా హెచ్1బీ వీసాల పైన కొన్నిరోజుల పాటు అమెరికాలోని కంపెనీల్లో పనిచేసేందుకు వెళుతుంటారు. అలాంటివారికి ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇక బ్రేకులు పడినట్లే. ఐతే రెగ్యులర్ వీసాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కారు చెప్తోంది. మొత్తమ్మీద అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యే వారికి ట్రంప్ భారీ షాకిచ్చేశారు.దీనిపై మరింత చదవండి :