రెండున్నరేళ్ళ బుడతడు.. వరల్డ్ మ్యాప్ ఎక్స్‌పర్ట్! (వీడియో)

vihaan chamala
PNR| Last Updated: మంగళవారం, 11 నవంబరు 2014 (14:50 IST)
అమెరికా, న్యూయార్క్ సిటీకి చెందిన రెండున్నరేళ్ళ ఎన్.ఆర్.ఐ బుడతడు ప్రపంచ మ్యాప్‌ను ఔపోసన పట్టేశాడు. ఫలితంగా.. ఈ మ్యాప్‌లో ఏ దేశం ఎక్కడ ఉందో.. క్షణాల్లో.. ఏమాత్రం తడుముకోకుండా... చకచకా.. చెప్పేస్తూ చూపరులను ఇట్టే ఆశ్చర్యపరుస్తున్నాడు.

హైదరాబాద్‌కు చెందిన జయశ్రీ అప్పనపల్లి, రఘురాం చామల అనే దంపతులు ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో ప్రవాస భారతీయులుగా నివశిస్తున్నారు. వీరికి రెండున్నరేళ్ళ విహాన్ చామల అనే కుమారుడు ఉన్నాడు. ఈ బుడతడు కేవలం రెండంటే రెండు నెలల్లో ప్రపంచ చిత్రపటాన్ని ఔపోసన పట్టేశాడు.

ప్రపంచ మ్యాప్‌లోని దేశాలను గుర్తించి.. ఆ దేశం పేరు ఫింగర్ టిప్స్‌పై చెప్పేస్తున్నాడు. ఇలా వరల్డ్ మ్యాప్‌లోని 202 దేశాలు/రాష్ట్రాల పేర్లను కేవలం 4 నిమిషాల 42 సెకన్లలో చెప్పి అరుదైన రికార్డును సృష్టిస్తున్నాడనే చెప్పొచ్చు. ఈ చిన్నారి మేథస్సు, జ్ఞాపకశక్తిని చూసి చూపరులు మంత్రముగ్ధులవుతున్నారు.

విహాన్ చామల వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దీనిపై మరింత చదవండి :