గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. నాటి వెండి కెరటాలు
Written By pnr
Last Updated : సోమవారం, 22 మే 2017 (13:00 IST)

జీవితసత్యాలను తెలిపే పాట.. మీరూ వినండి (Video)

జీవితసత్యాలను తెలిపే ఈ 'జీవనతరంగాలలో' అనే పాట.. 1973లో విడుదలైన "జీవనతరంగాలు" అనే చిత్రంలోనిది. ఈ గీతాన్ని ఆచార్య ఆత్రేయ రచించగా, ఘంటసాల వెంకటేశ్వరరావుగానం చేయగా జె.వి.రాఘవులు సంగీతాన్ని సమకూర్చారు.

జీవితసత్యాలను తెలిపే ఈ 'జీవనతరంగాలలో' అనే పాట.. 1973లో విడుదలైన "జీవనతరంగాలు" అనే చిత్రంలోనిది. ఈ గీతాన్ని ఆచార్య ఆత్రేయ రచించగా, ఘంటసాల వెంకటేశ్వరరావుగానం చేయగా జె.వి.రాఘవులు సంగీతాన్ని సమకూర్చారు.
 
ప్రముఖ రచయిత యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా సురేష్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన "జీవనతరంగాలు" కోసం ఆత్రేయ ఈ టైటిల్ సాంగ్‌ను రాశారు. "ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో" అనే మరపురాని గీతమే ఈ టైటిల్ సాంగ్. ఇందులో ప్రతి పదంలో చిత్రకథను, సన్నివేశాలను, సంఘటలను ప్రతిబింభిస్తూ, గుండెలు పిండే నగ్న సత్యాలను మనకు చెప్పిన ఆత్రేయ కనిపిస్తాడు. ఈ పాట వింటుంటే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లకుండా వుండవు. 
 
ముఖ్యంగా ఈ పాటలో "నీ భుజం మార్చుకోమంటుంది" అన్న సన్నివేశంలో పోలీసులను తప్పించుకోవడం కోసం కృష్ణంరాజు తెలియకుండానే తల్లి పాడెను తన భుజానికి మార్చుకోవడం నిజంగా గుండెలు పగిలే సన్నివేశం. సగటు మనిషి జీవితం దేవుడు ఆడే చదరంగం లాంటిది. అందులో ఎప్పుడు ఏ పావును ఎలా కదుపుతాడో ఊహించలేం. మనుషుల సంబంధ బాంధవ్యాలను చక్కగా ఈ పాటలో విశ్లేషిస్తారు. ఈ పాట చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం స్థిరస్థాయిగా ఉండిపోయేలా రాఘవులు బాణీ కట్టారు. అలాంటి మధురమైన పాటను మీరూ వినండి.