శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 30 నవంబరు 2021 (22:25 IST)

ఈ మూడు రాశుల వారికి 2022లో సంపద చేరుతుంది

కన్యా రాశి వారికి ప్రధమార్థంలో కాస్త ఇబ్బందులు వున్నప్పటికీ ఆర్థిక పరంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. 2022లో ఈ రాశి వారికి జీతం గణనీయంగా పెరగడంతోపాటు ఉద్యోగంలో గౌరవం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సౌకర్యాలు కూడా పెరుగుతాయి. కొన్ని చిన్నచిన్న సమస్యలు మినహా అంతా బాగుంటుంది.

 
మిథునరాశి - మిధున రాశి వారికి 2022 సంవత్సరంలో డబ్బు సంపాదించడానికి ఉత్తమ సమయం. వారికి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఆదాయ పెరుగుదలకు బలమైన జోడింపులు ఉంటాయి. ఈ రాశుల వారికి కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మిథునరాశి వారికి 2022 సంవత్సరం ఆర్థికంగా శ్రేష్టంగా ఉంటుందని చెప్పవచ్చు.

 
వృషభ రాశి వారికి 2022 సంవత్సరం చాలా ఫలవంతంగా ఉంటుంది. సంపద పెరుగుతుంది. మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయి. సంవత్సరం పొడవునా డబ్బు వస్తూనే ఉంటుంది. చాలా లాభదాయకంగా ఉంటుంది.