శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : బుధవారం, 17 జులై 2019 (13:35 IST)

ఆషాఢంలో గోరింటాకు..? పుట్టినింట భార్య మెట్టినింట వున్న భర్త కోసం..?

గోరింటాకు ఆషాఢంలో పెట్టుకోవడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీ. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే.. గోరింటాకు.. వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. 
 
ఆషాఢ మాసంలో పుట్టింట వుండే మహిళలు గోరింటాకు పెట్టుకుంటే మెట్టినింట వుండే భర్త ఆరోగ్యాన్ని ఆకాంక్షించినట్లు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. వేళ్లకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్లు పెళుసుబారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
 
గోరింటాకు మన శరీరానికి తాకితే.. అందులో లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన వ్యాధులు ఏర్పడతాయి. 
 
గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకు వాడాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.